Ranveer Singh wearing an expensive chain

Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన సినిమాల ద్వారా సౌత్ లో కూడా ఫేమస్ అయ్యారు.అయితే ఇప్పటివరకు ఈయన సౌత్ లో ఒక్క సినిమా లో కూడా నటించకపోయినప్పటికీ పాపులర్ నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు మాత్రం ఉంది.అయితే అలాంటి ఈ హీరో ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.

Ranveer Singh wearing an expensive chain

రీసెంట్ గా డైరెక్టర్ శంకర్ కూతురి పెళ్లిలో ఆయన ఆడిపడి అక్కడ ఉన్న వారందరినీ ఉత్సాహపరిచి ఆ పెళ్లిలో కొత్త సందడి తీసుకువచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. నగలు, బట్టలు ఖరీదైనవి వేసుకునే విషయంలో సెలబ్రిటీలను ఎవరు బీట్ చేయలేరు. అయితే అలాంటిది హీరోయిన్లు వేసుకునే నగల కంటే ఎక్కువ ధర గల ఒక డైమండ్ చైన్ ను రణవీర్ సింగ్ తన మెడలో వేసుకొని అందరితో అదరహో అనిపించారు. (Ranveer Singh)

Also Read: Kirak RP: మమ్మల్ని చిన్న చిన్న ప్రాణాలు అంది.. అదేమన్నా నేషనల్ ఆర్టిస్టా.. రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ ఆర్‌పి..!

అయితే తాజాగా ముంబైలోని గాలా ఈవెంట్లో పాల్గొన్న రణవీర్ సింగ్ తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరీ ముఖ్యంగా ఆయన మెడలో వేసుకున్న చైన్ ధర తెలిస్తే మీరందరూ నోరెళ్ళబెట్టాల్సిందే. తెలుపు రంగులో ఉన్న సాటిన్ షర్ట్ ప్యాంటు ధరించిన రణవీర్ సింగ్ హై హీల్స్ చంకీ చెప్పులను వేసుకొని అందరిలో అట్రాక్టివ్ గా నిలిచారు.మరీ ముఖ్యంగా ఆయన తన మెడలో వేసుకున్న చైన్ ను ధర ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Ranveer Singh wearing an expensive chain

ఇక రణవీర్ మెడలో ఉన్న ఆ చైన్ ధర అక్షరాల 2 కోట్ల రూపాయలట. ఇక రణవీర్ మెడలో ఉన్న చైన్ ను బెస్ఫోక్ టిఫాని రకానికి చెందినదని తెలుస్తోంది.ఇలా హీరోయిన్లు వేసుకునే నగలు వాళ్ళు కట్టుకునే చీరల ఖరీదు కంటే ఎక్కువ ఖరీదు గల చైన్ ని రణవీర్ వేసుకోవడంతో దీని ధర తెలిసిన ఆయన అభిమానులతో పాటు జనాలు కూడా షాక్ అవుతున్నారు.(Ranveer Singh)

Join WhatsApp