Shraddha Das: I will marry that Telugu hero

Shraddha Das: సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే మూవీ తో తెలుగు చిత్ర సినిమా రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి శ్రద్ధాదాస్. ఇక ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య 2 మూవీ..ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ప్రేమించే అమ్మాయి పాత్రలో శ్రద్ధదాస్ నటించింది. అలాగే శ్రద్దా దాస్ డిక్టేటర్, డార్లింగ్, ఏక్ మినీ కథ, నాగవల్లి,మరోచరిత్ర వంటి సినిమాల్లో కూడా నటించింది.

Shraddha Das: I will marry that Telugu hero

అయితే ఈమె చేసిన ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే నటించింది. కానీ హీరోయిన్ పాత్రలో మాత్రం నటించలేదు. అలాగే ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.అయితే గత కొద్ది రోజులుగా శ్రద్దా దాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే తాజాగా ఈ రూమర్ పై స్పందించింది శ్రద్ధ దాస్. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. (Shraddha Das)

Also Read: Allu Arjun: నా ప్రేమ మరియు మద్దతు పవన్ కళ్యాణ్‌కె.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అయితే నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను. అది కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన టాలీవుడ్ హీరో తోనే. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇప్పుడు ఆయన పేరు నేను బయట పెట్టను. అలాగే ఆ హీరో తో నా పెళ్లి కూడా ఇప్పుడు జరగదు. కానీ త్వరలోనే ఆ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెబుతాను. ఇక నేను ప్రేమించిన హీరో ఎవరు అనేది నా సన్నిహితులకి,ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అయితే అతని పేరు మాత్రం ఎప్పుడూ చెప్పను.

Shraddha Das: I will marry that Telugu hero

ఇక నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది లెటర్స్ రాసి ప్రపోజ్ చేశారు.కానీ నాకు ఇప్పటివరకు ఆ హీరో తప్ప ఎవరూ నచ్చలేదు అంటూ తన ప్రేమ గురించి ఎట్టకేలకు ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది శ్రద్దా దాస్. ఇక ఈ హీరోయిన్ తెలుగు హీరోని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో శ్రద్దా ప్రేమలో పడిపోయిన ఆ హీరో ఎవరై ఉంటారు అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు.(Shraddha Das)

Join WhatsApp