Who is the star hero who fell in love with Sridevi

Sridevi: అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటారంటే ముందుకు రాని హీరో అంటూ ఉండరు. అయితే అప్పట్లో శ్రీదేవి తల్లి చాలామంది హీరోలకు తన కూతురినిచ్చి పెళ్లి చేయాలని చూసిందట. కానీ ఎవరు కూడా శ్రీదేవి ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదట. అలాంటి వారిలో నటుడు రాజశేఖర్,కమల్ హాసన్ వంటి హీరోలు కూడా ఉన్నారు. అయితే ఈ హీరోలు ఎవరు శ్రీదేవిని పెళ్ళాడడానికి ఇష్టపడలేదు. ఇక దానికి కారణాలు మనకు అవసరం లేదు.

Who is the star hero who fell in love with Sridevi

కానీ అప్పట్లో ఓ స్టార్ హీరో శ్రీదేవి పై మనసు పడి ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని చూశారట. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఎందుకు అలాంటి పని చేసారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవిని ప్రేమించి ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలని చూసిన హీరో ఎవరో కాదు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. అయితే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇందులో కాస్త నిజం ఉంది అంటున్నారు సీనియర్ సినీ జర్నలిస్ట్ అయిన ఈమంది రామారావు..(Sridevi)

Also Read: Dil Raju: సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. సరికొత్త వర్క్ షాప్..!

ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ గురించి మాట్లాడుతూ..నేను కొన్ని రోజులు శ్రీదేవి ఇంట్లో పని చేసిన సందర్భంలో అక్కడికి ప్రతిరోజు రజినీకాంత్ వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి అక్కడున్న మేమందరం నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నాం.కానీ ఆ సమయంలో వీరు పెళ్లి చేసుకోలేదు.కానీ శ్రీదేవిని కాకుండా రజినీకాంత్ శ్రీదేవి చెల్లిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

Who is the star hero who fell in love with Sridevi

అయితే ఈ విషయం శ్రీదేవికి,శ్రీదేవి ఇంట్లో వాళ్లకు తెలిసి అప్పటినుండి రజినీకాంత్ ని ఇంటికి రావద్దని చెప్పారు. ఇక రజినీకాంత్ లతని పెళ్లి చేసుకోకముందు ఎన్నో వ్యసనాల బారిన పడ్డారు. ఆయనకు లేని అలవాటు అంటూ ఉండేది కాదు. ధూమపానం, మద్యపానం ఇలా అన్ని వ్యసనాలు ఆయనకు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే వారిని ఏడిపించకుండా ఉండేవారు కాదు.. అంటూ రజినీకాంత్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు బయటపెట్టారు ఈమంది రామారావు.(Sridevi)

Join WhatsApp