Kalyaan Dhev finally the truth about his divorce with Sreeja

Kalyaan Dhev: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ ఒకప్పుడు రెండు మూడు సినిమాలతో ఇండస్ట్రీలో హీరోగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ శ్రీజతో విడాకులు అయ్యాక ఈ హీరోకి పూర్తిగా ఇండస్ట్రీలో అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఇక మెగా ఫ్యామిలీ మద్దతు లేకపోతే ఇండస్ట్రీలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఒక పాప పుట్టాక కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు.

Kalyaan Dhev finally the truth about his divorce with Sreeja

ప్రస్తుతం వీరి విడాకుల విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకపోయినప్పటికీ వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. కానీ కళ్యాణ్ దేవ్ కి శ్రీజ కి కలిపి పుట్టిన కూతురు మాత్రం అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ దగ్గరికి వస్తుంది. ఇదిలా ఉంటే విరి విడాకులు గురించి ఇప్పటికే మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వైరలవ్వడంతో అది తన లైఫ్ ని ఉద్దేశించే కళ్యాణ్ దేవ్ పెట్టారు అని అందరూ భావిస్తున్నారు.(Kalyaan Dhev)

Also Read: Kriti Sanon: కృతి సనన్ వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ ధర అన్ని లక్షలా..?

ఇక ఆ వీడియోలో ఏముందంటే ఒక స్క్వేర్ వీల్ అలాగే రౌండ్ వీల్ రెండు రోడ్డుపై వెళ్తూ ఉండగా స్క్వేర్ వీల్ కి అనువైన దారి ఉండదు కానీ రౌండ్ వీల్ కి అనువైన రోడ్డు ఉండడం వల్ల అది సులువుగా వెళుతుంది.ఇక స్క్వేర్ వీల్ వెళ్లాలంటే దానికి అనువుగా ఉండే రోడ్డు కావాలి అని అర్థం వచ్చే ఒక వీడియో పెట్టాడు. అయితే ఈ వీడియోని చూసిన కొంత మంది జనాలు కళ్యాణ్ దేవ్ పరోక్షంగా తప్పంతా తనదేనని ఒప్పేసుకున్నాడు..

Kalyaan Dhev finally the truth about his divorce with Sreeja

అంటూ కామెంట్లు పెడితే మరి కొంతమంది ఏమో రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్లే కళ్యాణ దేవ్ పరిస్థితి ఇలా తయారైంది అని పరోక్షంగా ఇలా తెలియజేసాడు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టు తన జీవితాన్ని ఉద్దేశించి పెట్టుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది(Kalyaan Dhev)

Join WhatsApp