Star heroine Jyothika interesting comments

Jyothika: ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక మనందరికీ సుపరిచితమే. ఈమె ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు స్టార్ హీరో అయినా సూర్య భార్య కూడా. ఒకానొక సమయంలో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ ప్రస్తుతం కొంచెం స్లో అయింది.

Star heroine Jyothika interesting comments

ఇటీవల సైతాన్ మూవీ తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక రియంట్రీ సినిమా తోనే సూపర్ హిట్ విజయం అందుకుంది జ్యోతిక. ఇక తాజాగా ఎన్నికలపై ఈమె చేసిన కామెంట్స్ పై కస్తూరి స్పందిస్తూ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

Also Read: Meenakshi Chaudhary: బీచ్ లో వయ్యారాలు పోతూ ఫొటోస్ కి స్టిల్స్ ఇచ్చిన మీనాక్షి.. ఫొటోస్ వైరల్..!

ఇప్పటికే రవితేజ మరియు చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన జ్యోతిక వాళ్లతో కొందరు హీరోలతో నటించడం తనకి చాలా అదృష్టమంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ..” నాకు తెలుగు సినిమాలు చాలా ఇష్టం. నేను ఫస్ట్ రోజు తెలుగు సినిమాలలో నటించేందుకు చాలా భయపడ్డా. కానీ అనంతరం నాకు తెలుగు సినిమాలు ఫేవరెట్ అయిపోయాయి.

Star heroine Jyothika interesting comments

అలా తెలుగులో నటించిన అనుభూతి నాకు ఎప్పుడూ ఫేవరెట్ గానే నిలుస్తుంది. ఇక తెలుగులో రవితేజ మరియు చిరంజీవితో నటించినప్పుడు నాకు మంచి అనుభూతి కలిగింది. వాళ్లతో యాక్టింగ్ చేయడం నా అదృష్టమని భావిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిక. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.(Jyothika)

Join WhatsApp