
Radish: ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. ముల్లంగిలో విటమిన్ సి, విటమిన్ డి, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, కాపర్, జింక్, విటమిన్ b6, పొటాషియం లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. ముల్లంగిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముల్లంగిని ప్రతిరోజు తిన్నట్లయితే శరీరానికి కావలసినన్ని పోషకాలు లభిస్తాయి. అయితే ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే కదా అని రాత్రిపూట తిన్నట్లయితే ప్రమాదం బారిన పడినట్లే. ముల్లంగి వెచ్చదనం, చల్లదనం రెండూ కలిగి ఉంటుంది. Radish
Radish foods you must avoid eating with radish
అయితే రాత్రిపూట ముల్లంగిని తినడం వల్ల జలుబు సమస్యలు ఏర్పడతాయి. ముల్లంగిని రాత్రి సమయంలో కాకుండా మధ్యాహ్నం లేదా ఉదయం పూట తిన్నట్లయితే చాలా మంచిది. ఒక వ్యక్తి రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ముల్లంగిని తిన్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. ముల్లంగి తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ముల్లంగి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం పూట ముల్లంగిని తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.Radish
Also Read: Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!
ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తిన్న వెంటనే అస్సలు ఆకలి అనిపించదు ఎక్కువసేపు ఆకలి ఉండదు. దానివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. వేగంగా బరువు తగ్గుతారు. ముల్లంగిని తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు మెరుగుపడతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ముల్లంగి తిన్నట్లయితే చాలా మంచిది. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీనికి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తొలగించే సామర్థ్యం అధికంగా కలదు. దానివల్ల మధుమేహం లాంటి వ్యాధులు క్రమక్రమంగా తగ్గుతాయి. ముల్లంగిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు బ్యాక్టీరియా ఏర్పడకుండా చేస్తుంది. ఎలాంటి ఆనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చు. Radish
Also Read: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్…




