Fish: చేపలతో వీటిని తిన్నట్లయితే ప్రాణానికే ప్రమాద‌మా…ఇవి తెలుసుకోండి ?

Foods to Avoid With Fish

Fish: చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సంవత్సరం పొడవునా మార్కెట్లలో లభిస్తాయి. మాంసాహారం కన్నా సి ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. సి ఫుడ్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఏర్పడే చెడు బ్యాక్టీరియాను నివారించడంలో సీ ఫుడ్ చాలా సహాయం చేస్తుంది. అయితే సి ఫుడ్ లో చేపలు చాలా మంచిది. చాలామంది చేపల ఫ్రై, చేపల పులుసు, చేపలతో పచ్చడి లాంటివి చేసుకొని తింటూ ఉంటారు. చేపలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్య పని తీరును మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల వారి కడుపులోని శిశువు పెరుగుదల బాగుంటుంది. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి లోపాలు, ఆటంకాలు లేకుండా చురుగ్గా ఆరోగ్యంగా పెరుగుతారు. Fish

Foods to Avoid With Fish

గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల కడుపులోని శిశువు మెదడు పనితీరు బాగుంటుంది. శిశువు యొక్క ఎదుగుదలలో ఎలాంటి ఆటంకాలు లోపాలు లేకుండా చురుగ్గా పెరుగుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది. ఆ కారణంగా గర్భిణీ స్త్రీలు వారంలో ఒకసారి అయినా చేపలు తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చాలా వరకు చేపలు తినడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడుతుంది. ఆ కారణంగా ప్రతి ఒక్కరూ వారంలో ఒకటి లేదా రెండు సార్లు తప్పకుండా చేపలు తినాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. అయితే చేపలు ఆరోగ్యానికి మంచివే కదా అని అధికంగా తిన్నట్లయితే ప్రమాదం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చేపలను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తిన్నట్లయితే ప్రాణానికే ప్రమాదం పొంచి వస్తుందని చెబుతున్నారు. చేపలతో పొరపాటున కూడా నిమ్మకాయను కలిపి తినకూడదు. నిమ్మకాయ లేదా ఇతర పులుపు పదార్థాలను చేపలతో కలిపి తినిపిస్తున్నట్లయితే అది మన శరీరంలో విష పదార్థాలను రిలీజ్ అయ్యేలా చేస్తుంది.Fish

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

అందువల్ల చేపలతో పులుపు పదార్థాలను కలిపి అస్సలు తినకూడదు. చేపలను ఆకుకూరలతో కలిపి పొరపాటున కూడా తినకూడదు. చేపలు ఆకుకూరలు రెండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల చేపలు, ఆకుకూరలు కలిపి తినడం అస్సలు మంచిది కాదు. చేపలు, పెరుగు కలిపి తినకూడదు. పెరుగులో లాక్టిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. చేపలలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణం అవ్వడానికి అధిక సమయం పడుతుంది. ఆ కారణంగా వాంతులు వీరేచనాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కడుపునొప్పి కూడా ఏర్పడుతుంది. ఈ ఆహార పదార్థాలను పొరపాటున కూడా కలిపి తినకూడదు. Fish

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu