
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. డిసెంబర్ 15వ తేదీన ముంబైలో మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీన వేలంలోకి వదిలేసే ప్లేయర్లను కచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఈ సమయానికి కేవలం 15 రోజులు ఉన్నాయి. అయితే మినీ వేలం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. IPL 2026
IPL 2026 Rohit Sharma to Hyderabad SRH
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఇషాన్ కిషన్ ను తమ జట్టులోకి తీసుకువచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తోందట. దీనికోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ ఉన్నాడు. అయితే రోహిత్ శర్మను హైదరాబాద్ జట్టుకు పంపించి, ఇషాన్ కిషన్ ను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేశారట అంబానీ. ఈ మేరకు కావ్య పాపకు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. IPL 2026
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శవాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్…
అయితే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ వస్తే కచ్చితంగా తీసుకొని ఎందుకు కావ్య పాప కూడా సిద్ధంగా ఉన్నారట. ఇషాన్ కిషన్ ను వదిలేసేందుకు కూడా కావ్య పాప సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఇక అటు రాజస్థాన్ జట్టుకు సంబంధించిన సంజూ శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోందట. సంజూ…. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వస్తే ధోని స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు. IPL 2026
Also Read: Snake gourd: పొట్లకాయని అస్సలు లైట్ తీసుకోవద్దు.. కాన్సర్ ను కూడా బొంద పెడుతుందట…





