Mohan Babu@ 50 Years: మోహన్ బాబు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. మనోజ్ ని పిలుస్తారా..?

Mohan Babu@ 50 Years celebrations

Mohan Babu@ 50 Years: మంచు మోహన్ బాబు.. ఈయన ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. యాక్టర్ మాత్రమే కాదు మంచి విద్యావేత్త కూడా..స్కూల్స్,కాలేజెస్ స్థాపించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే అలాంటి మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. మోహన్ బాబు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ స్వర్గం నరకం..ఈ మూవీ 1975 నవంబర్ 22న రిలీజ్ అయింది.

Mohan Babu@ 50 Years celebrations

అయితే ఈ ఏడాది నవంబర్ 22 తో మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది.అలా ఇండస్ట్రీలో హీరోగా.. విలన్ గా.. కీరోల్స్ పోషించడంలో కూడా దిట్ట అయినటువంటి మోహన్ బాబు తన సినీ కెరియర్ లో దాదాపు 600 సినిమాలు చేశారు. అలాంటి ఈయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో మంచు ఫ్యామిలీ మోహన్ బాబు 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్గా చేయబోతున్నారట. మంచు విష్ణు ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకొని తన తండ్రి 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్గా చేయాలని చూస్తున్నారట.(Mohan Babu@ 50 Years)

Also Read: Baahubali The Epic: బాహుబలి రీ రిలీజ్ ని పట్టించుకోని ప్రేక్షకులు.. ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ పై…

ఈ నేపథ్యంలోనే నవంబర్ 22న MB 50-A Pearl white Tribute అనే ఈవెంట్ ని చేయబోతున్నారట. ఇక ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ మోహన్ బాబు 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ పాల్గొంటారా.. మనోజ్ ని ఆహ్వానిస్తారా అనేది బిగ్ క్వశ్చన్ గా మారిపోయింది.

Mohan Babu@ 50 Years celebrations

గత కొద్ది రోజుల నుండి మనోజ్ కి విష్ణుకి మధ్య జరిగిన గొడవల్లో మోహన్ బాబు పెద్ద కొడుకు వైపే ఉండడంతో మనోజ్ కి దూరమయ్యారు మనోజ్ తండ్రికి ఎం దగ్గర అవుదామని చూసినా కూడా మోహన్ బాబు దూరం పెడుతూ ఉన్నారు.మరి తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ కార్యక్రమానికి చిన్న కొడుకుని ఆహ్వానిస్తాడా అనేది చూడాలి. ఒకవేళ మనోజ్ ఈ కార్యక్రమానికి రాకపోతే మాత్రం మంచు ఫ్యామిలీ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి.మరి కొడుకును క్షమించి మోహన్ బాబు ఆహ్వానిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.(Mohan Babu@ 50 Years)

Share your love