

KCR: గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతి బయట పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఒక్క విషయం తెలిసినా, డొంక లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆర్టిఐ ద్వారా కొన్ని సంచలన విషయాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. భోజనాల ఖర్చు కోసం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాదాపు 995 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. KCR
KCR family meal expenses are 995 crores
2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవీకాలంలో తన కుటుంబ సభ్యుల భోజనాల కోసం ఏడాదికి 1000 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజల ధనాన్ని కల్వకుంట్ల కుటుంబం మింగేసిందని చెబుతోంది కాంగ్రెస్. చికెన్ మటన్ చేపలు కౌజు పిట్టలు కుందేలు కూరలtho కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం తినేసిందని సంచలనం పోస్ట్ కూడా పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా. అలాగే కెసిఆర్ తాగే ఆల్కహాల్ కూడా తెలంగాణ ప్రజల డబ్బేనని పేర్కొంది. కెసిఆర్ తో పాటు ప్రగతిభవన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు దావతులు చేసుకునేవారని పేర్కొంది. KCR
Also Read: Congress: చక్రం తిప్పిన షర్మిల..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ?
ప్రగతి భవన్ కోసం దాదాపు 2000 కోట్లు వృధా చేశాడని కూడా వెల్లడిస్తోంది కాంగ్రెస్. కెసిఆర్ 10 సంవత్సర కాలంలో భద్రత సిబ్బందితోపాటు అధికారికంగా పని వాళ్లకు శాకాహారం వంటలు మాత్రమే పెట్టేవారట. కుటుంబ సభ్యులు మాత్రం మాంసాహారం తినేవారని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇది కేవలం ప్రగతి భవన్ లో ఉన్న లెక్కలు మాత్రమేనని, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో లెక్కలు వేరే లాగా ఉంటాయని చెబుతోంది. అయితే దీనికి గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. తప్పుడు లెక్కలు చూపించి కాంగ్రెస్ అందరిని మోసం చేస్తోందని ఫైర్ అవుతోంది. KCR
Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !






