
ChatGPT Coach: ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కదలకుండా చేసే ఉద్యోగాల వల్ల బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. బరువు తగ్గాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించాలి లేదా ఖరీదైన Personal trainer సేవలు తీసుకోవాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ హసన్ అనే యువకుడు మాత్రం ఈ సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఆలోచించాడు. కేవలం తన మొబైల్‌లో ఉన్న ChatGPTను ఒక Virtual coachగా మార్చుకుని, 12 వారాల్లోనే ఏకంగా 27 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Man Loses 27kg Using ChatGPT Coach
హసన్ ముందుగా తన వయస్సు, ఎత్తు, బరువు వంటి వివరాలను ఏఐకి ఇచ్చి, ఒక Nutritionistలా తనకు సరిపోయే Customized diet plan రూపొందించమని కోరాడు. రోజుకు 1800 Calories మించకుండా, అందులో 120 Grams protein ఉండేలా ఒక స్పష్టమైన Meal planను ఫాలో అయ్యాడు. ప్రత్యేకమైన సప్లిమెంట్స్ లేకుండా, ఇంట్లో దొరికే సాధారణ ఆహారంతోనే డైట్ కొనసాగించడం ఈ ప్రయాణంలో కీలక అంశం. Cravings వచ్చినప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో కూడా ఏఐ ద్వారా ప్రాక్టికల్ టిప్స్ పొందాడు.
వ్యాయామం విషయంలో జిమ్‌పై ఆసక్తి లేని హసన్, ఇంట్లోనే ఎక్విప్‌మెంట్ లేకుండా చేసే 25–35 నిమిషాల Workout planను అనుసరించాడు. ఇది కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, ఒక నిజమైన కోచ్‌లా రోజూ నిద్ర, వర్కవుట్, నీటి తీసుకోవడం వంటి విషయాలపై ఫాలో-అప్ చేసేది. అంతేకాదు, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం 5 నిమిషాల Journaling కూడా అతని డైలీ రొటీన్‌లో భాగమైంది. ఇది అతనికి Consistency మరియు మానసిక స్థైర్యాన్ని అందించింది.
ప్రతి వారం తన బరువు, నడుము కొలతలను రివ్యూ చేసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకున్నాడు. ఈ విధంగా Disciplined AI planning, క్రమశిక్షణ మరియు టెక్నాలజీను సరిగ్గా ఉపయోగించడం ద్వారా హసన్ సాధించిన విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరైన విధానంలో Technologyను వాడితే ఆరోగ్యం, జీవనశైలి ఎంత సానుకూలంగా మారుతాయో చూపించే Inspiring example ఇదే. ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా జీవితాలను మార్చగలదని హసన్ నిరూపించాడు.




















