రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ కు వెళ్తుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ తో రిలీజ్ డేట్ లో మార్పు లేదని మూవీ టీమ్ స్పష్టం చేసింది. ఈ నెల 27నే మాస్ జాతర సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.
ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ లో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించారు. టీజర్ నిండా రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ ఎలిమెంట్స్ కనిపించాయి. ధమాకా తర్వాత రవితేజ సరసన శ్రీలీల మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో దర్శకుడు భాను భోగవరపు మాస్ జాతర చిత్రాన్ని రూపొందించారు. భాను గతంలో సామజవరగమన అనే చిత్రానికి రైటర్ గా పనిచేశారు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.





