రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్స్ విషయంలో జంప్స్ మీద జంప్స్ చేస్తోంది. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 12కు వస్తుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ కొత్త డేట్ వల్ల పలు చిన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈలోగా సెప్టెంబర్ 12న కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదని డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. మాస్ జాతర సినిమాను అక్టోబర్ చివరలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చారట.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మాస్ జాతర సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కు చేస్తున్న ప్యాకేజీ మూవీగా మాస్ జాతర రూపొందుతోంది.





