మారిన మెగా లైనప్

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కంటిన్యూగా యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అవుతున్నాడు. తన సినిమాలు సెట్స్ మీద ఉండగానే కొత్త చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. మెగా స్పీడ్ లో కెరీర్ కొనసాగిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీతో పాటు ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. మెగా 157గా పిలుస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రేజీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాలి. ఆల్రెడీ ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడితో మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమానే స్టార్ట్ చేస్తారనుకుంటే ఇప్పుడు బాబీతో సినిమాను ప్రకటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇలా శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ముందుగా బాబీతో సినిమా చేసి.. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేసేలా ప్లాన్ మార్చారని తెలిసింది.

Share your love