మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఆ నెలంతా పెద్ద సంఖ్యలో రిలీజ్ లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ కూడా అదే నెలలో రిలీజ్ కు వస్తోంది. దీంతో విశ్వంభర రిలీజ్ ను మరో నెల ఆలస్యంగా అక్టోబర్ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మెగా 157 రిలీజ్ కు రెడీ అవుతోంది.
సో అక్టోబర్ కంటే లేట్ చేయడం కరెక్ట్ కాదని విశ్వంభర టీమ్ భావిస్తోంది. భారీ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే స్పెషల్ సాంగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకుంటున్నాయి. వీఎఫ్ఎక్స్ క్వాలిటీగా చేసేందుకే టీమ్ టైమ్ తీసుకుంటోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ్ రూపొందిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.





