
Mohini emotional: 90వ దశకంలో డ్రీమ్ గర్ల్‌గా తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన నటి మోహిని (Mohini) తన సినీ ప్రయాణంలోని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, బాలకృష్ణతో Aditya 369, చిరంజీవితో Hitler వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన మోహిని, క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారారు.
Mohini emotional about career struggles
తన కెరీర్‌లో ఎదురైన ఒక కఠిన అనుభవాన్ని వివరిస్తూ, తమిళ చిత్రం Kanmani షూటింగ్‌లో డైరెక్టర్ ఆర్.కే. సెల్వమణి తనను swimming pool సీన్ కోసం swimsuit ధరించమని బలవంతం చేశారని చెప్పారు. తాను ఈత రాదని, ఆ సీన్‌పై ఇబ్బంది వ్యక్తం చేసినప్పటికీ వినిపించలేదని, చివరికి కన్నీళ్లతో ఆ సీన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. “అది తప్ప మరే సినిమాలో గ్లామరస్‌గా కనిపించలేదు” అని మోహిని జ్ఞాపకం చేసుకున్నారు.
అంతేకాకుండా, తనకు చేజారిన గొప్ప అవకాశాల గురించి కూడా చెప్పారు. రజనీకాంత్ Muthu, సూర్య నటించిన Surya Son of Krishnan వంటి సినిమాల్లో కీలక పాత్రలు తనకే రావాల్సి ఉన్నాయని, కానీ వాటిని కోల్పోయానని బాధపడ్డారు. రజనీకాంత్‌ను కలవమని కొందరు చెప్పినా పట్టించుకోలేదని, ఆ కారణంగా ఆఫర్ తప్పిపోయిందని తెలిపారు.
వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, తన భర్త కజిన్ తనపై black magic చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, భగవంతుడి దయతో ఆ కష్టాల నుంచి బయటపడ్డానని చెప్పారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మోహిని, చివరికి విడాకులు తీసుకుని ప్రస్తుతం అమెరికాలో కొత్త జీవితం కొనసాగిస్తున్నారు.

