
Regina: ఏంటి రెజీనా వల్ల ఆ మెగా హీరో పెళ్లి పెటాకులైందా..ఇంతకీ రెజీన వల్ల ఏ హీరో పెళ్లి చెడిపోయింది.ఆ హీరో పెళ్లిలో రెజినా ఎందుకు వేలు పెట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రెజీనా వల్ల చెడిపోయింది ఏ హీరో పెళ్ళో కాదు సాయి దుర్గ తేజ్. అవును ఈ విషయాన్ని స్వయంగా సాయి దుర్గ తేజ్ తాజాగా అభయం మసూమ్ సమ్మిట్ -2025లో చెప్పారు.. మీడియాలో వచ్చిన తప్పుడు వార్తల కారణంగా నా లవర్ నన్ను వదిలేసి వెళ్లిపోయింది.
The mega hero wedding is a disaster because of Regina
మీడియాలో నా గురించి పెళ్లి వార్తలు ఎన్నో రాశారు.ఆ హీరోయిన్ తో పెళ్లి ఈ హీరోయిన్ తో పెళ్లి అని వార్తలు రావడం ఇబ్బంది తెచ్చిపెట్టింది.ఈ రూమర్ల కారణంగా 2023 లో నాకు బ్రేకప్ జరిగింది. కాలేజీ డేస్ నుండి ఓ అమ్మాయి ని ప్రేమించాను. కానీ మీడియా చేసిన అతి వల్లే నా ప్రేమ విఫలమైంది అంటూ సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చారు. (Regina)
Also Read: Prabhas:”మా పెళ్లి జరిగితేనే మీ నోర్లు మూతపడతాయి”.. ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్.!
అలాగే నా పెళ్లి విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకుండానే నా పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ నేనే స్వయంగా చెబుతాను అని చెప్పారు. అలాగే తనకు కాబోయే భార్యకు తానే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే సాయి దుర్గ తేజ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు సాయి దుర్గ తేజ్ పెళ్లి పెటాకులు అవ్వడానికి కారణం రెజీనానే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

దానికి కారణం రెజీనా సాయి దుర్గ తేజ్ కాంబోలో వచ్చిన సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య సంథింగ్ ఏదో నడుస్తుందనే రూమర్లు వినిపించాయి.అయితే ఈ రూమర్ల కారణంగానే సాయి దుర్గ తేజ్ లవ్ ఫెయిల్ అయ్యిందని ఆయన లవర్ వదిలేసి వెళ్ళిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Regina)


