
Niranjan Reddy: బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ ఎమ్మెల్సీ కవిత నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు అంటూ ఫైర్ అయ్యారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని మండిపడ్డారు. Niranjan Reddy
Niranjan Reddy slams kavitha
ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటే, మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు కానీ మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాము, ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదని విమర్శలు చేశారు. మేము కేసీఆర్ గారికి మంచి పేరు తెస్తుంటే, నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావు అంటూ ఆగ్రహించారు. Niranjan Reddy
Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భర్త?
ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని ఫైర్ అయ్యారు. నాకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది, నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకు ఎక్కడివి? అని మండిపడ్డారు. తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యే లను ఇంటికి పిలిపించుకుని, జాగృతిలో చేరాలని అడిగి, ఒప్పుకోని నా లాంటి వాళ్ల మీద ఆరోపణలు వేస్తున్నావు అని నిలదీశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. Niranjan Reddy
Also Read: Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?





