

Kavitha: కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. టీ న్యూస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు కవిత. Kavitha
Kavitha slams t news and brs
తనపై, తన భర్తపై ఆధారాలు లేకుండా భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని నోటీసులలో పేర్కొన్నారు. తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మండిపడ్డారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఫైర్ అయ్యారు. లేకపోతే, సుప్రీం కోర్టు వరకు అయినా వెళతానని ప్రకటించారు కవిత. పందెం కోళ్ల కేసులో కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తానని హెచ్చరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. Kavitha
Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల పరువు తీసిన ప్రధాని మోడీ…
కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారని ఆగ్రహించారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతానని వార్నింగ్ ఇచ్చారు. జనంబాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయన్నారు. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని హెచ్చరించారు కవిత. Kavitha
Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త అరెస్ట్







