Ginger: చలికాలంలో వచ్చే వ్యాధులకు ఈ చిన్న ముక్కతో చెక్‌ ?

Ginger: చలికాలంలో చాలామంది జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో వీటన్నింటినీ తగ్గించుకోవడానికి నోట్లో చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని నమలడం వల్ల వికారం, వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జలుబు దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు, విష జ్వరాలు సులభంగా తగ్గుతాయి. చలికాలంలో చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం నివారిస్తుంది. Ginger

Benefits of eating ginger in winter

అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు చిన్న అల్లం ముక్క తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి చలికాలంలో చాలా సమయం పడుతుంది. అలాంటి వారు చాలామంది తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, వీరేచనాలతో బాధపడతారు. అలాంటివారు చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని నమిలినట్లయితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. చిన్న అల్లం ముక్కను ఒక గ్లాసెడు వేడి నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని వడగట్టుకుని తాగినట్లయితే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి కషాయం లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజూ అల్లం ముక్క వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు మెరుగుపడతాయి. గ్యాస్, అల్సర్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Ginger

Also Read: KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

డయాబెటిస్ లాంటి సమస్యలను తరిమి కొట్టవచ్చు. కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు నీటిలో అల్లం ముక్క వేసి మరిగించి ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తాగినట్లయితే చాలా మంచిది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల స్త్రీలలో కడుపు నొప్పి, పీరియడ్స్ సమస్యలు తగ్గుతాయి. అల్లం ముక్క బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం ముక్క వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కొవ్వు సమస్యలను నివారించడానికి అల్లం ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ నీటిని ప్రతి రోజు తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చలికాలంలో అల్లం ముక్క వేసి నీటిని మరిగించుకొని తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Ginger

Also Read: Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం..