Oral Care: మీ నోటి ఆరోగ్యానికి ఒకే రకమైన టూత్‌పేస్ట్, బ్రష్ సరిపోవు.. ఎందుకంటే?

Oral Care

మీ నోటి ఆరోగ్యానికి ఒకే రకమైన టూత్‌పేస్ట్, బ్రష్ సరిపోవు.. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోటి ఆరోగ్యం ఒకేలా ఉండదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇతర ఫ్యాక్టర్స్ బట్టి ఓరల్ కేర్ అవసరాలు మారుతాయి. అందుకే మీకు సరిపోయే ప్రొడక్ట్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే సరైన క్లీనింగ్ జరగకపోవచ్చు.

సర్జరీ అయిన వారు, ఐసీయూలో ఉన్నవారు లేదా చేతులు కదల్చలేని వారికి సాధారణ టూత్‌పేస్ట్ వాడటం కష్టం. వారికి పుక్కిలించాల్సిన అవసరం లేని స్పెషల్ సొల్యూషన్స్ అవసరం. అలాగే ఆటిజం వంటి ఇంద్రియ సమస్యలు ఉన్నవారికి ఎక్కువ నురుగు లేదా పుదీనా రుచి నచ్చకపోవచ్చు. వారికి తక్కువ నురుగు, మెత్తని టెక్స్చర్ ఉన్న టూత్‌పేస్ట్ బాగుంటుంది.

క్యాన్సర్ పేషెంట్లు, డయాబెటిస్ ఉన్నవారికి నోరు పొడిబారడం, చిగుళ్ల బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. వారు సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్, ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వంటి మైల్డ్ ప్రొడక్ట్స్ వాడాలి. బ్రేసెస్ ధరించే టీనేజర్లకు బ్రాకెట్ల మధ్య ఫుడ్ పార్టికల్స్ చిక్కుతాయి, కాబట్టి ఇంటర్‌డెంటల్ బ్రష్, వాటర్ ఫ్లాసర్ అవసరం. వృద్ధులకు చిగుళ్లు సెన్సిటివ్‌గా మారతాయి, వారు మెత్తని ప్రొడక్ట్స్ వాడడం మంచిది.

పిల్లల విషయానికి వస్తే, వారికి ఫ్లేవర్డ్, లో-ఫోమింగ్ టూత్‌పేస్ట్ ఇష్టంగా ఉంటే బ్రష్ చేసే అలవాటు పెరుగుతుంది. మొత్తానికి, ఓరల్ కేర్ విషయంలో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పద్ధతి పని చేయదు. మీ నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవాలంటే, మీ డెంటిస్ట్ సలహా ప్రకారం పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడమే బెస్ట్. ఇది మీ డెంటల్ హెల్త్‌ను లాంగ్ టర్మ్‌లో ఇంప్రూవ్ చేస్తుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu