
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల భుజానికి surgery చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ operation తర్వాత ఆయనకు పూర్తి రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్లు స్పష్టం చేశారు. కానీ హైదరాబాద్ లోని తన నివాసానికి తిరిగి వచ్చిన వెంటనే, పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు నాయకుల తాకిడి మొదలైంది. వీరితో సమయం వెచ్చించాల్సి రావడంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
Rest for Pawan Kalyan: అభిమానుల విన్నపం
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటికి టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు నుంచి జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇంచార్జ్ల వరకు పరామర్శల కోసం క్యూ కడుతున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు ఆరు గంటలు పవన్ కల్యాణ్ వారితో మాట్లాడాల్సి వచ్చింది. అవతల నుంచి వచ్చిన వారికి షేక్ హ్యాండ్ లు ఇచ్చేందుకు, బొకేలు తీసుకునేందుకు కుడి చేతిని వాడాల్సి వస్తోంది. ఇదంతా ఆపరేషన్ గాయం మానడానికి ఆటంకంగా మారింది.
పవన్ కల్యాణ్ స్వభావం ప్రకారం ఎవరినీ నిరాకరించలేక సమయం వెచ్చిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు బెడ్ రెస్ట్ అత్యవసరం అని వైద్యులు సూచించారు. అందుకే సోషల్ మీడియాలో పార్టీ నాయకులు కూడా పవన్‌కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు వచ్చే వారిని కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఆయనకు పూర్తి రెస్ట్ ఇచ్చేలా పార్టీ బాధ్యులు చూడాలని అభిమానులు కోరుతున్నారు. సర్జరీ తర్వాత వచ్చే గాయం మానడానికి కనీసం నాలుగు రోజులు కూడా ఫుల్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, ఆయన వర్క్ తో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో నాయకులు సహకరించాలి.







