Harish Rao joins BJP.. Bandi Sanjay sensational comments

Harish Rao : ముస్లిం రిజర్వేషన్లని రద్దు చేస్తామని బీజేపీ విధానం మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల మీద మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాడింది బీఆర్ఎస్ అని బీసీల కోసం గళం విప్పింది మేమే అని రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి పోతుందని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

Harish Rao comments on Revanth Reddy

అయితే తిట్టూ లేదంటే ఒట్టు అన్నట్లుగా రేవంత్ రెడ్డి విధానం ఉందని ఫైర్ అయ్యారు దేవుడుని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. బీసీల మీద ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యపదమని చెప్పారు. ఈటల గెలుస్తారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన కామెంట్ల మీదే ఖచ్చితంగా పరిశీలన ఉంటుందని మల్లారెడ్డి సందర్భానికి తగ్గట్టు మాట్లాడాడని అనుకుంటున్నామని అన్నారు అన్ని పరిశీలించిన తర్వాత మల్లారెడ్డి వ్యాఖ్యల మీద చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హరీష్ రావు క్లియర్గా చెప్పారు.

Also read: Raj Tarun: స్టార్ యాంకర్ తో రాజ్ తరుణ్ ఎఫై**.. ఎట్టకేలకు సీక్రెట్ చెప్పిన హీరో..!

అలానే హరీష్ రావు మాట్లాడుతూ ప్రధాని మోడీని బడే బాయ్ అని రేవంత్ రెడ్డి పొగిడితే కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీష్ రావు క్వశ్చన్ చేసారు. సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ పొగిడితే ఆయన మీద బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని నిలదీశారు ఇలా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అలానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బిజెపి విధానం మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ మంత్రి హరీష్ రావు ఇలా స్పందించారు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాడింది బీఆర్ఎస్ అని బీసీల కోసం బీఆర్ఎస్ గళం విప్పిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి హరీష్ రావు ఇలా కౌంటర్ ఇచ్చారు (Harish Rao).

Harish Rao joins BJP.. Bandi Sanjay sensational comments
Join WhatsApp