KCR Horoscope

KCR: దేశాన్ని బీజేపీ పదేళ్ల నుండి పరిపాలిస్తోందని బిజెపి ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మోడీ కనీసం వంద నినాదాలు చెప్పాడు ఒకటైన నిజమైందా అని అన్నారు. మోడీ చెప్పిన కట్టు కథలు పిట్ట కథలు నిజమయ్యాయి అని కేసిఆర్ అన్నారు. గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయని మోడీ చెప్పాడు వచ్చాయా అని ఓటర్లని అడిగారు. క్లాక్ టవర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలని రాశామని అన్నారు.

KCR comments on BJP

ఇవాళ బీజేపీ అభ్యర్థి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కెసిఆర్ అడిగారు. ఢిల్లీ సరిహద్దు లో రైతు ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయారని అన్నారు. అయితే స్వయంగా నేనే వెళ్లి రైతు కుటుంబానికి పరిహారం అందించాలని ఆయన గుర్తు చేశారు. చట్టం ప్రకారం ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి ఒకటైన నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క సీటు కూడా ఎందుకు వేయాలి అని కేసీఆర్ అన్నారు.

Also read: Ampere Nexus: ఇండియాలో లాంచ్ కాబోతున్న ఆంపియర్ నెక్సస్..!

దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకి మీటర్లు పెట్టకపోతే 5000 కోట్ల గ్రాండ్ నిలిపివేస్తామని చెప్పారని కెసిఆర్ అన్నారు. నా ప్రాణం పోయినా తలకాయ తెగిన మీటర్లు పెట్టను అని అన్నారు ఇక్కడ చోటే బాయ్ అక్కడ బడే బాయికి ఓటేసిన ఒక్కటే. మన నీళ్లను తరలించకపోయిన రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తే డీకే అరుణ మంగళహారతులు పట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది మాకు ఓటు వేస్తే నిమిషాల మీద చేసేస్తామని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం నడుస్తలేదు అని కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికుల స్కీములు రద్దు చేశారు నా కళ్ళముందు తెలంగాణ నుండి నాశనం చేస్తే ప్రభుత్వం మీద యుద్ధం చేస్తానని కేసీఆర్ అన్నారు (KCR).

KCR Horoscope
Join WhatsApp