
Ram Charan: గ్లోబల్ స్టార్ Ram Charan ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ Peddi షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. Uppena ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ village backdrop sports drama పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పెద్ది తర్వాత చరణ్ తన తదుపరి సినిమాను Rangasthalam డైరెక్టర్ సుకుమార్ తో చేయనున్నట్టు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది.
Is Kriti Sanon Ram Charan heroine
సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే ఈ RC17 మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ buzz క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ Kriti Sanon ను హీరోయిన్ గా తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే చిత్ర యూనిట్ కృతి సనన్ ను సంప్రదించి story discussions జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక announcement రావాల్సి ఉంది. కృతి సనన్ ఇంతకుముందు టాలీవుడ్ లో చేసిన 1 Nenokkadine, Dohchay, Adipurush వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఆదిపురుష్ మూవీలో సీత పాత్రపై వచ్చిన విమర్శలు గుర్తుంచుకోవాల్సినవి.
ఇలాంటి పరిస్థితుల్లో కృతి సనన్ ను రామ్ చరణ్ లాంటి mega hero పక్కన ఎందుకు తీసుకుంటున్నారు అన్నదానిపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో మిక్స్ రియాక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక Pushpa 2 తర్వాత సుకుమార్ తెరకెక్కించే ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగి పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ క్రేజ్ సృష్టిస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు టాక్ ఉంది.




















