‘ది ప్యారడైజ్’ విలన్ రాఘవ్ జుయాల్ కొత్త హిందీ సినిమా ‘భాయ్ తేరా స్టార్ హై’

Villain in The Paradise film

కిల్ సినిమాతో తనదైన మార్క్‌ వేసుకున్న Raghav Juyal, తాజాగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్‌లో ది ప్యారడైజ్ విలన్‌గా రాబోతున్నాడు. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ కి అది టాలీవుడ్‌ ఎంట్రీ కాగా, అంతకు ముందు ఓ హిందీ ప్రాజెక్ట్‌లో హీరోగా కనిపించబోతున్నాడు.

ది ప్యారడైజ్ విలన్ న్యూ రోల్

నెలా షూట్ చేసిన ఈ సినిమా పేరు భాయ్ తేరా స్టార్ హై. ఇందులో Raghav ఓ యాక్టర్‌గా నటించగా, ఫేమస్ డిజిటల్ కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం ఫీమేల్ లీడ్‌ రోల్‌లో నటించింది. డైరెక్టర్‌ కమ్ ప్రొడ్యూసర్ వివేక్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు, వాళ్లు ఈ మూవీని కేవలం ఒక నెలలోనే షూట్ చేశారు. వర్క్‌షాప్‌లు ముందే చేసి, యాక్టర్లందరూ ముందుగానే లైన్స్ నేర్చుకోవడం వల్లే అంత త్వరగా కంప్లీట్ చేయగలిగామని ఆయన చెప్పారు.

ఈ సినిమా కథ ఓ యాక్టర్ చుట్టూ తిరుగుతుంది, అతను సూపర్‌స్టార్ అవుతానంటూ భ్రమలో బతుకుతూనే ఉంటాడు. కానీ అతడు నిజంగా బ్యాడ్ యాక్టర్ మాత్రమే. ఇందులో సంజయ్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ది ప్యారడైజ్ సినిమాలో నానితో పోటీ పడుతున్న Raghav పై ఇప్పటికే అంచనాలు హైలో ఉన్నాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu