SS Rajamouli: రాజమౌళి ఫస్ట్ లవ్ గురించి షాకింగ్ ట్రూత్

ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి ఫస్ట్ లవ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా తీస్తున్న ఈ దర్శకుడు ఒకప్పుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా భయపడ్డాడట.

SS Rajamouli first love flashback

Inter క్లాస్ లో సిగ్గుపడ్డ రాజమౌళి

రాజమౌళి తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏలూరులో చదివిన రోజుల గురించి గుర్తు చేసుకున్నాడు. ఆ క్లాస్ లో ఓ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టం అని, కానీ ఆమెతో మాట్లాడే ధైర్యం లేదని చెప్పాడు. క్లాస్ లోని అందరు అబ్బాయిలకు తన క్రష్ తెలిసినా, ఆ అమ్మాయికి చెప్పడానికి సిగ్గుపడ్డాడట.

చివరికి రిస్క్ తీసుకున్నాడు

ఏడాది మొత్తంలో ఒక్కసారే ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె తన ముందు సీట్లో కూర్చున్న సమయంలో చాలా కష్టం మీద భారతీ, ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాడు. ఆమె వెనక తిరిగిన లుక్ తనకు ఎప్పటికీ మరచిపోలేని ఎక్స్‌ప్రెషన్ అని, ఆ కళ్ళ కోసం ఎన్ని రోజులో ఎదురుచూశాడని తెలిపాడు.

ఆ తర్వాత జరిగిందేంటి?

రాజమౌళి ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత చదువు ఆపేసి, కొన్నేళ్లకు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తమ ఫ్యామిలీకి దగ్గరైన ఓ అమ్మాయి రమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఫ్యాషన్ విలన్ పేరుతో పాపులర్.

Share your love