
Vadde Naveen: ఏంటి వడ్డే నవీన్ కి డబ్బు ఉందని పొగరు తో ఎవరిని లెక్క చేయడా.. అందుకే చాలా వరకు ఇండస్ట్రీలో కెరియర్ ని కోల్పోయారా.. గోల్డెన్ స్పూన్ తో పుట్టాను అన్న పొగరుతో అందరిని అవమానించేవారా.. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో నవీన్ పై ఉన్న ఈ రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్ కావడంతో వడ్డే నవీన్ కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఈయనకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అవి బ్లాక్ బస్టర్ కాదు కానీ ఓ రేంజ్ లో హిట్ అయితే అయ్యాయి.
Director Shoking Comments on Vadde Naveen
ఈయన చేసిన సినిమాలు చాలా వరకు యావరేజ్ గా ఆడాయి. అలా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన సడన్ గా ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే వడ్డే నవీన్ కి చాలా పొగరు ఉంటుందని, అందుకే ఆయన్ని సినిమాల్లో తీసుకోవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదనే ఒక రూమర్ ఉంది. ఈ రూమర్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వడ్డే నవీన్ తో కలిసి వర్క్ చేసిన డైరెక్టర్ చంద్ర మహేష్ తెలిపారు.డైరెక్టర్ చంద్ర మహేష్ వడ్డే నవీన్ తో కలిసి చెప్పాలని ఉంది అని సినిమా చేశారు. (Vadde Naveen)
Also Read: Naga Chaitanya: నా భార్య రెండు తలల పాము.. పెళ్లయ్యాక ఫస్ట్ టైం శోభిత నిజ స్వరూపం బయటపెట్టిన…
అయితే ఈ సినిమా స్టోరీ చెప్పడం కోసం వడ్డే నవీన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడని, అలాగే రేపు సాయంత్రం మనం ఈ సినిమా గురించి మాట్లాడదామని చెప్పి ఆ తర్వాత వెళ్ళాక ఎంతో బాగా రిసీవ్ చేసుకొని మర్యాదగా సార్ సార్ అంటూ మాట్లాడారని, ఆయన ఎంతో ఉన్నతంగా మాట్లాడారు.కానీ ఎందుకు ఆయనపై ఇలాంటి రూమర్లు వచ్చాయో అర్థం కాలేదు అంటూ చంద్ర మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు టాలీవుడ్లో వస్తున్న రూమర్స్ గురించి వడ్డె నవీన్ దగ్గర ప్రస్తావించి ఎందుకు సార్ మీ మీద ఇలాంటి రూమర్లు ఉన్నాయి.

మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదే అని అంటే ఇండస్ట్రీ లో ఇలాంటివన్నీ కామనే..సమాజంలో మన గురించి ఎవరో ఏమో మాట్లాడుకుంటారు. వాటిని పట్టించుకోకూడదు అంటూ వడ్డె నవీన్ సమాధానం ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని చంద్ర మహేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో సినిమా హీరో హీరోయిన్ల మీద ఇలాంటి రూమర్లు ఇండస్ట్రీలో ఎన్నో పుట్టుకు వస్తాయి. వారిని దగ్గరుండి చూసిన వారికే వారి మనస్తత్వం అర్థం అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Vadde Naveen)

