Congress MLA Anirudh Reddy: OG మూవీ ఫ్లాప్..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప‌రువు తీసిన తెలంగాణ ఎమ్మెల్యే ?

Congress MLA Anirudh Reddy: తెలంగాణ వాళ్ల‌వి దిష్టికండ్లు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌న్నీ డిజాస్టర్లే అంటూ బాంబ్ పేల్చారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో…. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి అంటూ స‌వాల్ విసిరారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. Congress MLA Anirudh Reddy

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

OG మూవీ ఫ్లాప్ అయినా రూ.800 పెట్టి నేను సినిమా చూశా అంటూ చుర‌క‌లు అంటించారు. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? అని నిలదీశారు. ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్‌ అన్నిట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా? అంటూ ఫైర్ అయ్యారు. Congress MLA Anirudh Reddy

Also Read: KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే అంటూ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూశాన‌న్నారు. మాది నర దిష్టి అయితే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు.. ఇక్కడ అన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉండన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. Congress MLA Anirudh Reddy

Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి

Share your love