
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ వాళ్లవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు. దానివల్ల ఆ కోస్తా ఆంధ్ర కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయని కూడా ఆ పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది. ఇప్పటికే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy on pawan kalyan
పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడ నివ్వబోమని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి స్థాయిలో తాను ఈ స్టేట్మెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. Komatireddy Venkat Reddy
Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్…తెరపైకి సీపీఐ నారాయణ పేరు ?
ఆయన వెంటనే క్షమాపణలు చెబితే, సినిమాలు ఒక్క రెండు రోజులు మాత్రం ఆడతాయి.. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తిగా ఆడని బొమ్మని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే మీరే నాశనం అయిపోతారని కూడా హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని హైలెట్ చేస్తోందని గులాబీ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. Komatireddy Venkat Reddy
Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?





