
Congress: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది ఎన్నికల సంఘం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు విడుదల లో లోకల్ బాడీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నప్పటికీ గులాబీ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. Congress
Funds only for villages won by Congress candidates
కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్న స్థానాల్లో గులాబీ పార్టీ సానుభూతిపరులు సర్పంచులుగా గెలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నేతలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాలకి నిధులు ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు అనిరుద్ రెడ్డి. Congress
Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?
ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న నేను సంతకం పెట్టాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సంతకం పెడతానంటూ బాంబు పేల్చారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తన సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేని అనిరుద్ రెడ్డి, ఆత్మరక్షణ కోసం ఇలా బెదిరింపులకు దిగుతున్నాడని కౌంటర్ ఇస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. Congress
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ..టీడీపీ కార్యకర్తల దాష్టీకం





