TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం

TSRTC
TSRTC

TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను భారీ స్థాయిలో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌ణాళిక నేప‌థ్యంలో ఆర్టీసీ సిబ్బంది భ‌విష్య‌త్ పై అనిశ్చితి నెల‌కొంది. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం ఈ డ్రైవ్ కింద న‌గ‌రానికి రెండు వేల‌కు పైగా ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రానున్నాయి. ఆర్టీసీ రూపొందించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ముఖ్యంగా రాబోయే రోజుల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో పూర్తిగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను న‌డ‌పాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంది.



RTC in Hyderabad PRIVATE

ఈ బ‌స్సులు ప్రైవేట్ సంస్థ‌ల ద్వారా గ్రాస్ కాంటాక్ట్ విధానంలో న‌డ‌వ‌నున్నాయి. ఈ విధానంలో డ్రైవ‌ర్లు, మెకానిక్ లు ప్రైవేటు కంపెనీల‌కు చెందిన వారే ఉండ‌గా.. కేవ‌లం కండ‌క్ట‌ర్లు మాత్ర‌మే ఆర్టీసీ సిబ్బందిగా ఉంటారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ప‌ని చేస్తున్న డ్రైవ‌ర్లు, గ్యారేజీ సిబ్బంది క‌లిపి దాదాపు 8 వేల మంది ఉన్నారు. ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్రవేశించిన త‌రువాత వీరిలో పెద్ద సంఖ్య‌లో సిబ్బంది అద‌నంగా మిగిలే ప‌రిస్థితి ఏర్ప‌డ‌నుంది.

Also Read : FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష

ఈ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు సంస్థ ఓ స‌ర్దుబాటు ప్ర‌ణాళిక రూపొందించింది. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న కండ‌క్ట‌ర్ పోస్టులు కూడా పూర్తిగా భ‌ర్తీ అయితే డ్రైవ‌ర్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని వారు కోరుకున్న జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ బ‌స్సుల‌ను నేరుగా కొనుగోలు చేయ‌కుండా ప్రైవేటు కంపెనీల‌కు అప్ప‌గించే విధానం పై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ద‌శ‌ల వారిగా ఆర్టీసీని ప్రైవేట్ సంస్థ‌ల చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో మ‌రిన్ని ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్ర‌వేశిస్తే.. డిజీల్ బ‌స్సులు సిబ్బంది పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : KETHIREDDY VENKATARAMI REDDY : ఎవడిని వదిలేది లేదు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి నరకమే?