‘ఓజీ’కి జోడీ కన్మణి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రోజు ఓజీ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె ఈ చిత్రంలో కన్మణి అనే క్యారెక్టర్ లో ఆకట్టుకోనుందని వెల్లడించారు. తుఫాన్ లాంటి హీరో పాత్రకు ఆమె ప్రశాంతతను అందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓజీ’ సెప్టెంబర్ 25 విడుదల కానుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu