రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా మారే అవకాశం ఉండేది. కానీ మిక్స్డ్ టాక్ తో ఆ ఫీట్ చేసే అవకాశం కోల్పోయింది. నిజానికి కూలీ సినిమాకు మరే చిత్రానికి రానంత హైప్ క్రియేట్ అయ్యింది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ, ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ చూపించింది.
తొలి రోజు కూలీ సినిమా అందరి ఎక్స్ పెక్టేషన్స్ మించి 151 కోట్ల రూపాయల వసూళు చేసింది. డే 1 వసూళ్లలో కోలీవుడ్ లో రికార్డ్ క్రేయేట్ చేసింది. అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో కూలీ ఈజీగా వెయ్యి కోట్ల రూపాయలు అందుకుంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఆ రేంజ్ లో లేకపోవడంతో లాంగ్ రన్ కష్టంగా మారింది. సినిమాకు టాక్ బాగా వచ్చి ఉంటే వెయ్యి కోట్లు పెద్ద కష్టమేం కాకపోయేది. ఇప్పటిదాకా తమిళ పరిశ్రమలో ఏ సినిమాకూ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాలేదు.





