తెలుగు డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ లోకి స్టెప్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు తక్కువ సినిమాలు చేసినా, మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని, సమంతతో మూడు సినిమాలు చేశారు. ముఖ్యంగా ‘మా ఇంటి బంగారం’ సినిమా భారీ హిట్ కొట్టడంతో నందిని రెడ్డికి క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ సక్సెస్ తో బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తాజా ఇంటర్వ్యూలో నందిని చెప్పిన వివరాల ప్రకారం, తాను రెండేళ్ళు ఢిల్లీలో చదువుకున్నానని, అప్పుడు రెగ్యులర్ గా హిందీ సినిమాలు చూసేదానినని చెప్పారు. మంచి కథ ఉంటే కచ్చితంగా హిందీలో సినిమా చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, త్వరలో ఒక డార్క్ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ చేయబోతున్నారు, ఇది అక్టోబర్ లో మొదలవుతుంది. ఇన్నాళ్ళు లైట్ హార్టెడ్ సినిమాలు చేసిన నందిని ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు.ఆ వెబ్ సిరీస్ పూర్తయిన తర్వాత సినిమా గురించి ఆలోచిస్తారు.
బాలీవుడ్ ఎంట్రీకి నందిని రెడ్డికి రాజ్ సాయం చేసే అవకాశం ఉంది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఇప్పటికే బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా మంచి ఫేమ్ సంపాదించారు. నందిని మరియు రాజ్ కు మంచి స్నేహం ఉన్నందున, మంచి కథ రెడీ చేస్తే రాజ్ సాయంతో బాలీవుడ్ లోకి ఈజీగా ఎంటర్ అవ్వడం ఖాయం. ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది.
తాను తీయబోయే ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నందిని రెడ్డి ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా లెవెల్ లో మరింత గుర్తింపు తెచ్చుకుంటారని అంచనా. నిజానికి బాలీవుడ్ లో స్టెప్ పెట్టడానికి నందిని రెడ్డి ఆసక్తి చూపడం వల్ల ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది.ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.





