Hit And Run: కొడుకును తప్పించాలని చూసిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అరెస్ట్

వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ hit and run కేసులో తన కొడుకును తప్పించాలని ప్రయత్నించిన ఆరోపణల నేపథ్యంలో ఇది జరిగింది. అప్పలరాజుకు చెందిన కాశీబుగ్గ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లినప్పుడు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో పరిస్థితి శాంతించింది.

hit and run కేసు నేపథ్యం ఇలా..

కొన్ని రోజుల క్రితం అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ అతివేగంగా బైక్ నడుపుతూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, బైక్ నడిపింది తన కొడుకు కాదని, అతని స్నేహితుడు సిద్దార్థ అని నమ్మించేలా అప్పలరాజు ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆరవ్ను తప్పించేందుకు సహాయం చేసిన స్థానిక ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు.

అంతేకాదు, బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ను కూడా మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా అప్పలరాజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, ఈ కేసు విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలయ్యాయి. 18 ఏళ్ల చిన్న పిల్లాడు తెలిసీతెలియక యాక్సిడెంట్ చేస్తే murder కేసు పెడతారా అని జగన్ ప్రశ్నించడం తీవ్ర వివాదానికి దారితీసింది. క్లియర్గా ఆరవ్ నిర్లక్ష్యం వల్ల ఓ ప్రాణం పోయినప్పటికీ, ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఆ కేసును మోటార్ వెహికల్ యాక్ట్ కింద కాకుండా హోమీసైడ్ సెక్షన్ల కింద నమోదు చేసిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.

Share your love