

TDP: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన రూల్స్ విషయంలో ఇండిగో మొండి వైఖరి వ్యవహరించింది. తక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచింది. అలాగే టెక్నికల్ పరంగా చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైన ట్రోలింగ్ చేస్తున్నారు. TDP
TDP deepak reddy video goes viral yellow media
అతని చేతకానితనం వల్ల ఇండిగో ఇలా రెచ్చిపోతుందని ఫైర్ అవుతున్నారు. రిపబ్లిక్ టీవీ అర్నాబ్ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. గతంలో బిజెపి వైఫల్యాలను ఎత్తిచూపని ఆర్నాబ్, ఇప్పుడు మాత్రం రామ్మోహన్ నాయుడు పై విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టిడిపి నేత దీపక్ రెడ్డి డిబేట్ లో అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. అంతా నారా లోకేష్ వార్ రూమ్లో దీనిపైన చర్చిస్తున్నారని దీపక్ రెడ్డి పేర్కొన్నారు దీంతో దీపక్ రెడ్డిని ఆర్నాబ్ తో పాటు వైసిపి సోషల్ మీడియాలో ఆడుకుంటోంది. అయితే తాజాగా ఇదే దీపక్ రెడ్డి ఆంధ్ర జ్యోతి ఈ ఛానల్ కు చెందిన డిబేట్ లో కూర్చున్నారు. TDP
Also Read: Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?
మీ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ రీడర్ వెంకటకృష్ణ ప్రశ్నించారు. అయితే దానికి వింత సమాధానమిచ్చారు దీపక్ రెడ్డి. ఎల్లో మీడియా తనను కావాలనే టార్గెట్ చేసిందని టంగ్ స్లిప్ అయ్యారు. ఎల్లో మీడియా అనగానే టాపిక్ డైవర్ట్ చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు వెంకటకృష్ణ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో వైసిపి మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టింది. సొంత ఛానల్ ని టిడిపి నేతలు ఎల్లో మీడియా అంటున్నారని సెటైర్లు పేల్చుతోంది. TDP
Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…







