
Heroines: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీ నటులు ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కామన్ గానే చూస్తారు.అయితే తాజాగా ఓ ఇద్దరు హీరోయిన్లు ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి అసలు తప్పే కాదు అన్నట్టుగా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నారు. మరి ఇంతకీ వాళ్ళు ఎవరు అనేది చూస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ట్వింకిల్ ఖన్నా,కాజోల్.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లలో కాజోల్,ట్వింకిల్ ఖన్నాలు కూడా ఉంటారు.
Star Heroines support Illegal Affaires
అయితే ఇలాంటి దిగ్గజ హీరోయిన్స్ నుండి ఈ కామెంట్స్ అస్సలు ఊహించలేరు. తాజాగా ట్వింకిల్ ఖన్నా,కాజోల్ లు హోస్ట్ లుగా చేస్తున్న టూ మచ్ విత్ టాక్ షో కి జాన్వీ కపూర్, కరన్ జోహార్ లు గెస్ట్ లుగా వచ్చారు. అయితే ఈ టాక్ షోలో ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్ ఈ రెండింట్లో ఏది పెద్ద నేరం ..ఏది తప్పు అన్నట్లుగా ప్రశ్న ఎదురవగా.. కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా,కాజోల్ ఈ ముగ్గురు కూడా ఎమోషనల్ చీటింగ్ పెద్ద నేరమని,ఫిజికల్ చీటింగ్ అసలు తప్పే కాదు అని చెప్పారు.(Heroines)
Also Read: Hero: తండ్రి కాబోతున్న మరో స్టార్ హీరో.. కానీ ఒక్క కండిషన్..!
కానీ జాన్వీ కపూర్ మాత్రం ఫిజికల్ చీటింగ్ పెద్ద తప్పు అని చెప్పింది. కానీ జాన్వీ కపూర్ ఇచ్చిన ఆన్సర్ కి ఆ ఇద్దరు హీరోయిన్స్ 20 లో ఇలాగే అనిపిస్తుంది. 50 ఏళ్లు వచ్చాక మాలాగే నీకు ఫిజికల్ చీటింగ్ అసలు తప్పే కాదు అనిపిస్తుంది అని చెప్పారు. అయితే వీరి ఉద్దేశం ప్రకారం భర్తలు ఎవరితో అయినా ఎఫైర్స్ పెట్టుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు అని చెప్పారు.దీంతో చాలామంది జనాలు వీరి పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఒక బాధ్యతాయుతమైన హీరోయిన్ల స్థానంలో ఉన్న మీరు మాట్లాడవలసిన మాటలేనా ఇవి..పెళ్లయిన వారు ఎవరు ఎవరితోనైనా ఎఫైర్లు పెట్టుకోవచ్చా? అసలు మీరు భారతదేశంలోనే ఉన్నారా.. మీకు అలాంటి బుద్ధులు ఉంటే అందరికీ అలాంటి బుద్ధిలే ఉండాలా అంటూ ఏకిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.మరి వీరు చేసిన కామెంట్లని వెనక్కి తీసుకుంటారా.. వీటిపై ఏ విధంగా క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.(Heroines)





