TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించిన టీడీపీ ?

TDP
TDP

TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించింది టీడీపీ పార్టీ. డిబేట్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంద‌ట తెలుగుదేశం పార్టీ. ఇటీవల ఇండిగో సంక్షోభంపై మంత్రి నారా లోకేష్ సైతం సమీక్షిస్తున్నారని డిబేట్‌లో ఓ టీడీపీ అధికార ప్రతినిధి చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ టీడీపీ అధికార ప్రతినిధిని రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. TDP

TDP boycotts Republic TV

కేంద్రానికి చెందిన అంశంలో లోకేష్ జోక్యం ఎందుకు? ఏవియేషన్ మంత్రి కాదు కదా? అని నిలదీసిన ఆర్నబ్ గోస్వామి, వీడియో వైర‌ల్ గా మారింది. దీంతో తెలుగు దేశం పార్టీ ప‌రువు దేశ వ్యాప్తంగా ప‌రువు పోయింది. ఇందుకు నిరసనగానే.. రిపబ్లిక్ టీవీని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు ఉందంటూ నెట్టింట్లో కామెంట్లు వ‌స్తున్నాయి. అంతేకాదు రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి కూడా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త‌మ ఛానెల్ కు రాకుండా టీడీపీ పార్టీ త‌మ నేత‌ల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి వెల్ల‌డించారు. TDP

Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?

ఆ వీడియో కూడా వైర‌ల్ గా మారింది. కాగా, దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆగిన సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా మంది ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే, కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును ఉద్దేశించి, రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామితో పాటు ప్ర‌యాణుకులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రిగా రామ్మోహ‌న్ నాయుడు విఫ‌లం అయ్యాడ‌ని పేర్కొంటున్నారు. వెంట‌నే అత‌ని ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్లు పెడుతున్నారు. TDP

Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?

Share your love