Whirlpool Ac: New AC with Intelli Cool Technology

AC : వేసవికాలంలో ఎండను తట్టుకోలేక ఏసీ ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎండాకాలంలో ఏసీ నుండి చల్లటి గాలి వస్తూ ఉంటే హాయిగా నిద్ర పడుతుంది. లేదంటే చికాకుగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఏసీ కూలింగ్ తగ్గుతుంది. ఎందుకు ఏసీ కూలింగ్ తగ్గుతుంది దాని వెనుక కారణాలేంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. ఏసీ కూలింగ్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే కూలింగ్ బాగా ఇవ్వాలంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం. ఎయిర్ కండిషనర్లలో ఫిల్టర్ లని క్లీన్ చేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ ఫిల్టర్ లో గాలి లోని దుమ్ము ధూళి బ్లాక్ చేసి ప్యూర్ గాలి ని అందిస్తుంది. ఫిల్టర్ లను క్రమం తప్పకుండా తనికీ చేయాలి.

AC cooling tips

విండో టైప్ ఏసి వాడుతున్న స్ప్లిట్ ఏసీ ని వాడుతున్నా కూడా కూలింగ్ రావాలంటే, ఏసి ఎక్కువకాలం బాగా పనిచేయాలంటే ఫిల్టర్స్ చాలా అవసరం. చాలామంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. టెక్నీషియన్ ను పిలిపిస్తే డబ్బులు ఇవ్వాలని సొంతంగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి కనీసం ఏడాదికి ఒకసారైనా లేదంటే వేసవి మొదలైనప్పుడైనా క్లీన్ చేయించాలి. ఏసీ ఫిల్టర్ లని సున్నితంగా హ్యాండిల్ చేయాలి మీరే స్వయంగా క్లీన్ చేస్తున్నట్లయితే శుభ్రం చేసేటప్పుడు బయటికి తీసేటప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Also read: Ranveer Singh: దీపిక పదుకొనే తో విడాకులు తీసుకోబోతున్న రణవీర్.. ప్రూఫ్ ఇదే..!

ఫిల్టర్ కి పట్టిన దుమ్ముని బయటకి తీయడానికి గోడకి లేదా నేలమీద కొట్టడం వంటివి చేయకూడదు. అలానే దీన్ని క్లీన్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్ని వాడకండి ఫిల్టర్ ని శుభ్రపరచడం కంటే ఎక్కువ హాని చేస్తుంది. ఏదైనా సంభావ్య నష్టం జరగకుండా ఫిల్టర్ ని శుభ్రం చేయడానికి సాధారణ నీటిని మాత్రమే వాడండి. ఏసీ ఫిల్టర్ లని క్లీన్ చేసేటప్పుడు మందపాటి దారాలు లేదా కఠిన అల్లికలు ఉన్న క్లాత్ ని ఉపయోగించకూడదు ఇటువంటివి ఫిల్టర్లకి హాని చేయొచ్చు (AC).

Whirlpool Ac: New AC with Intelli Cool Technology
Join WhatsApp