Vivo Y18 Mobile launched in India

Vivo Y18 Mobile: ఇండియన్ మార్కెట్ అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ స్మార్ట్ ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని చేతిలో అయినా సరే… కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే కంపెనీల నుంచి రకరకాల మొబైల్ ఫోన్స్ తక్కువ ధరలో వస్తున్నాయి. దీంతో విపరీతంగా జనాలు కొత్త ఫోన్లు కొంటున్నారు. Vivo Y18 Mobile

Vivo Y18 Mobile launched in India

ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ఇండియా మార్కెట్లోకి మరోసారి కొత్త ఫోన్ వచ్చేసింది. చైనా దేశానికి చెందిన వివో కంపెనీ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. వివో వై 18 పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది. ఇందులో 4 జి బి రామ్, 64 జిబి స్టోరేజ్ ఉన్న మోడల్ ఉంది. అలాగే 4gb ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంటుంది. Vivo Y18 Mobile

Also Read: Vivo V30e: భారత మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్..!

ఇక మొదటి మోడల్ విషయానికి వస్తే దీని ధర 9000 రూపాయలు మాత్రమే. అలాగే 4gb రాం మరియు 108 జిబి స్టోరేజ్ ఉన్న మొబైల్ ద్వారా పదివేల రూపాయలుగా నిర్ణయించారు. ఏదైనా క్రెడిట్ కార్డ్ తో ఈ మొబైల్ కొంటే మరింత డిస్కౌంట్ వస్తుంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. Vivo Y18 Mobile

అంతేకాకుండా ఇది 14 ఆండ్రాయిడ్ సిస్టం తో పనిచేస్తుంది. ఈ మొబైల్ లో 50 ఎంపీ రేర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ పిక్సెల్ కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ సిమ్, 4g, వైఫై అలాగే బ్లూటూత్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. Vivo Y18 Mobile

Join WhatsApp