Amazon : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్ పేరుతో సేల్ ని జరుపుతోంది. అయితే దీనిలో భాగంగా ఎప్పుడు లేని విధంగా స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది ఈ సేవలో భాగంగా 20 వేలల్లో అందిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.. మరి ఇక ఫోన్ లోకి సంబంధించి పూర్తి వివరాలు చూసేసి తక్కువ ధరకే ఫోన్ లని కొనుగోలు చేసేయండి.. ఐక్యూ జెడ్‌9 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 24,999కాగా, 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,999కి వస్తోంది. ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే… ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు తగ్గుతుంది. 44 వాట్స్‌ ఛార్జర్‌ను అందించారు.

Smartphones under Rs.20,000

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్ ఫోన్‌ వచ్చేసి రూ. 26,999కాగా సేల్‌లో భాగంగా రూ. 18,999కి వస్తోంది. కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక రియల్‌ మీ నార్జో 70 ప్రో విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా సేల్‌లో భాగంగా రూ.19,999కి వస్తోంది.

Also read: Revanth Reddy: చూసి ఓటు వెయ్యకపోతే రిజర్వేషన్లు రద్దు..!

అదనంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొంటే రూ. 1000 వరకు డిస్కౌంట్‌ ఉంటుంది. 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్ కెమెరాను అందించారు. Samsung Galaxy A15 5G అసలు ధర రూ. 21,499 కాగా డిస్కౌంట్‌లో రూ. 19,499కి కొనచ్చు. అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్ కలిగి వుంది (Amazon).

Join WhatsApp