
Congress: తెలంగాణ రాష్ట్రంలో మరో కాంగ్రెస్ నేత భారీ స్కాంకు తెరలేపారు. 300 ఎకరాల TGSIIC భూములపై కన్నేశాడట కాంగ్రెస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయంలో TGSIIC కి కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులకు మారం కావాలని అనుమతులు తీసుకొని పెద్ద గుట్టను మాయం చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వార్తలు వస్తున్నాయి. Congress
Congress MLA sets eyes on 300 acres of TGSIIC lands
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది కేసీఆర్ సర్కార్. పారిశ్రామిక వాడ కోసం TGSIIC కి కేటాయించడం జరిగిందట. ఈ భూములపై కన్నేసి, అభివృద్ధి పనుల కోసం ఈ భూమిలో ఉన్న మోరం కావాలని అధికారుల నుండి అనుమతులు తెచ్చుకున్నాడట కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. Congress
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !
రోజుకు 20 ట్రక్కుల మోరం తవ్వుకుంటామని అనుమతి తీసుకున్నాడని అంటున్నారు. రోజుకు 150 ట్రక్కుల మోరం తవ్వుతూ, 5 నెలల్లో పెద్ద కొండలను సదరు కాంగ్రెస్ నాయకుడి అనుచరులు మాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మోరం తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకోగా, పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారట కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు అధికారులు. Congress
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?


