Spirit: ప్రభాస్ “స్పిరిట్” లో స్టార్ హీరో తమ్ముడు..!

The star hero younger brother in the movie Spirit

Spirit: దగ్గుబాటి అభిరామ్ తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయారు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ అభిరామ్ కు పెద్దగా కలిసి రాలేదు. ఆ మధ్యకాలంలో అహింసా సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి దారుణంగా బోల్తాపడ్డారు. అప్పటినుంచి అభిరామ్ సినిమాల వైపు చూడలేదని చెప్పవచ్చు. అలాంటి ఈ తరుణంలో ఆయనకు ఒక పాన్ ఇండియా స్థాయిలో వచ్చే సినిమాలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

The star hero younger brother in the movie Spirit

అది కూడా ప్రభాస్ సినిమా అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా వస్తున్న విషయం అందరికీ తెలుసు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇందులో కథానాయిక గా త్రిప్తి డిమ్రీ ఎంపికైంది. ఈ విధంగా సినిమా గురించి సోషల్ గురించి అనేక వార్తలు వస్తున్న సమయంలో ఇందులో అభిరామ్ నటిస్తున్నారని తెలుస్తోంది. (Spirit)

Also Read: Akshay Kumar: అక్షయ్ కుమార్ పై 100 కోడిగుడ్లతో దాడి చేసిన అమ్మాయిలు..ఏం జరిగిందంటే.?

అంతేకాదు ఇందులో ఆ పాత్ర అభిరామ్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందని, ఇందులో అభిరామ్ యాటిట్యూడ్ చూపించే వ్యక్తిగా నటిస్తారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ పాత్రను ఎంతో స్టైలిష్ గా సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసినట్టు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజముందో అబద్దమందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అభిరామ్ కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు.

The star hero younger brother in the movie Spirit

అయితే ఈ సినిమాలో ఆఫర్ల కోసం ఎంతో మంది హీరోలు ఎదురు చూస్తున్నారు. ఇక మంచు విష్ణు అయితే ఒక అవకాశం ఇవ్వాలని ఒక లేఖ కూడా రాశారు. అలాంటి ఈ టైంలో అభిరామ్ కు ఆఫర్ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి చూడాలి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అభిరామ్ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది తెలియరాదు. ఇక అభిరామ్ అన్న రానా ఓవైపు హీరోగా.. విలన్ గా..నిర్మాతగా.. చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.(Spirit)

Share your love