
Gopichand: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే ఆషామాషీ విషయం కాదు. రవ్వంత అదృష్టంతో పాటు నటనా టాలెంట్, కథలను ఎంపిక చేసే విధానం కూడా ఉండాలి. ఏ జనరేషన్ కు తగ్గట్టుగా ఆ కథలను ఎంపిక చేసుకొని అందులో నటించాలి. ఓసారి అన్ని కలిసి వచ్చినా కానీ టైం కలిసి రానప్పుడు మనం ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. అలా సినిమా ఇండస్ట్రీలో అన్ని కలిసి వచ్చినప్పుడే ఆ చిత్రం సక్సెస్ అవుతుంది. ఆ హీరోకి పేరు వస్తుంది.
Will Gopichand become a villain for a star hero
అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు ఇతర నటినటులు ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకొని ఆ తర్వాత డల్ అయిపోతారు. కొంతమంది చాలా కష్టపడి చాలా ఫెయిల్యూర్స్ చూసి ఆ తర్వాత సక్సెస్ బాట పడతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల స్థాయికి చేరుకొని మళ్లీ డల్ అయిపోయిన వారిలో ముఖ్యంగా గోపీచంద్ ఒకరు.. విలన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత యజ్ఞం సినిమా ద్వారా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్టేటస్ సంపాదించుకున్నారు.(Gopichand)
Also Read: Tv 5 Murthy: 10 కోట్లు ఇస్తావా.. ప్రై**ట్ వీడియోలు బయట పెట్టనా హీరోని బెదిరిస్తున్న టీవీ 5…
అలా లక్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సినిమాలు అద్భుతమైన హిట్ సాధించాయి. గౌతమ్ నందా, సాహసం వంటి సినిమాలు కూడా కాస్త ఊరటనిచ్చినా సూపర్ హిట్ అయితే కాలేదు. అలా హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ కు ఈ మధ్యకాలంలో వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాదాపుగా పది చిత్రాలు పూర్తిగా ఫ్లాప్ అవ్వడంతో ఆయన హీరోగా ఫేడౌట్ అయ్యారంటూ వార్తలు వినిపించాయి.

దీంతో గోపీచంద్ ఆలోచన చేసి మళ్లీ విలన్ గా రాబోతున్నట్టు సమాచారం.. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్నటువంటి బ్లడీ రొమియో మూవీలో గోపీచంద్ ప్రధాన విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.(Gopichand)


Roja: నేను సినిమాలు మానేయడానికి కారణం ఆయనే.. విజయ్ పై రోజా షాకింగ్ కామెంట్స్.?