Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?

Kavitha cm revanth runs a company

Kavitha: కెసిఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలల నుంచి కెసిఆర్ కుటుంబం పై విమర్శలు చేస్తూ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా హరీష్ రావును బలి చేస్తూ కల్వకుంట్ల కవిత కామెంట్స్ కూడా చేస్తున్నారు. గులాబీ పార్టీ ఓటమికి హరీష్ రావు కారణమంటూ బాంబు పేల్చుతున్నారు కవిత. కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు పార్టీకి పనికిరారని ఆమె తేల్చి చెప్పేస్తున్నారు. Kavitha

Kavitha cm revanth runs a company

అయితే దీనికి కౌంటర్ దాడి గులాబీ పార్టీ మొదలుపెట్టింది. కల్వకుంట్ల కవితను లిక్కర్ రాణిగా అభివర్ణిస్తూ తొలిసారిగా గులాబీ పార్టీ నేతలు కూడా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కల్వకుంట్ల కవిత నడిపిస్తున్న కంపెనీ వివరాలను కూడా బయటపెట్టారు. ఆడికోర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత అలాగే సృజన్ సూదిని ఉన్నారు. ఇందులో కల్వకుంట్ల కవిత డైరెక్టర్ గా పని చేశారట.Kavitha

Also Read: MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంస‌న్‌?

అటు రేవంత్ రెడ్డి కూడా డైరెక్టర్ గా ఉన్నారని సమాచారం. అయితే ఈ కంపెనీ ఇప్పుడు నడుస్తుందో లేదో కానీ, వీళ్ళిద్దరి మాత్రం ఈ కంపెనీని గతంలో నడిపినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఇప్పటికి కూడా దొంగ చాటున ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ కుటుంబాన్ని అలాగే గులాబీ పార్టీని నాశనం చేసే దిశగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నట్లు మండిపడుతున్నారు. Kavitha

Also Read: KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_