వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు అనేది మూవీ టీమ్ వెల్లడించలేదు. వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించనున్నారు. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.





