డే 1 వసూళ్లలో ‘కూలీ’ రికార్డ్

ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే డే 1 వసూళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తొలి రోజు వసూళ్లలో కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా డే 1 వసూళ్లలో విజయ్ లియో సినిమా ఉంది. ఈ చిత్రానికి మొదటి రోజు 140 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కూలీ సినిమా ఆ రికార్డ్ ను క్రాస్ చేసింది.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్..వంటి స్టార్ కాస్టింగ్ తో గ్రాండ్ గా ఈ సినిమా తెరకెక్కింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కోట్లాది రూపాయలు ఆర్జించింది కూలీ సినిమా. ఓవర్సీస్ లో అప్పుడే 3 మిలియన్ క్రాస్ చేసింది. తెలుగు స్టేట్స్ లో డే 1 కూలీ దాదాపు రూ.15 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి గానీ డివైడ్ టాక్ తో లాంగ్ రన్ లో ఈ క్రేజ్ కొనసాగడం కష్టమే.

Share your love