
Avocado: అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అవకాడోను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటున్నారు. దీనికి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు సూచనలు చేయడంతో ప్రతి ఒక్కరూ ఎక్కువ రేటు ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేసి తింటున్నారు. అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ పండును ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అవకాడో తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అవకాడో గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
Also Read: Bananas: అరటి పండ్లు వాన కాలంలో తింటున్నారా? అయితే జాగ్రత్త…!
Will eating avocado damage your kidneys
శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో అవకాడో కీలక పాత్ర పోషిస్తుంది. అవకాడోలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అవకాడోను చాలా రకాలుగా తయారు చేసుకొని తినవచ్చు. అవకాడోతో జ్యూస్ కూడా చేసుకుని తాగుతారు. అవకాడో అన్ని రకాల సలాడ్ లలో వాడవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది. అయితే అవకాడో కిడ్నీ రోగులకు అసలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అవకాడో కిడ్నీ రోగులకు హానికరం. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు పొటాషియంను శరీరం నుంచి సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతాయి. దీని వలన రక్తంలో పొటాషియం అధికంగా పేరుకు పోతుంది. అవకాడో హైపర్ అలేమీయాకు దారితీస్తుంది. ఇది గుండెలయకు అంతరాయం కలిగిస్తుంది. దానివల్ల ఆకస్మిక మరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు అవకాడో పండు తినకపోవడమే చాలా మంచిది.
Also Read: Water Cane: ఒకే వాటర్ క్యాన్ చాలా రోజులు వాడుతున్నారు…అయితే జాగ్రత్త?
మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు దీనిని అసలు తినకూడదు. అవకాడో తినడం వల్ల మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల వారి ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు తప్పితే మిగతావారు ప్రతి ఒక్కరు అవకాడోను ఎలాంటి సందేహాలు లేకుండా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పండు నేటి కాలంలో మార్కెట్లలో అధికంగా లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా తక్కువ ధరకే మార్కెట్లలో అమ్ముతున్నారు. చిన్నపిల్లలకు కూడా అవకాడోను ప్రతిరోజు తినిపించినట్లయితే వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అవకాడో చిన్నపిల్లలకు తినిపించడం వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చురుగ్గా ఆరోగ్యంగా తయారు అవుతారు.
Also Read: Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?




















