వైసీపీ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, పార్టీకి వచ్చేదానికంటే పోయేదే ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా సరైన దిశానిర్దేశం లేకుండా నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో తమ పొరపాట్లను గమనించుకోవాల్సింది పోయి, ప్రభుత్వానికి వ్యతిరేకతే తమకు మేలు చేస్తుందనే అనుకుంటున్నారు. ఫలితంగా వైసీపీలో ఇమేజ్ ఎక్కడికో పోతోంది.
ysrcp image is fading fast
స్థానిక నాయకులు కూడా సరైన direction లేకుండానే ఉన్నారు. ఉత్తరాంధ్రలో కేవలం నలుగురైదుగురు మాత్రమే active గా ఉంటే, సీమలో ఇద్దరు ముగ్గురు మాత్రమే voice వినిపిస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. గుంటూరులో అయితే అంబటి రాంబాబు చుట్టే వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇలా పార్టీ వర్క్ చేస్తున్నట్టు కనిపించడం లేదు.
మాజీ ఎమ్మెల్యేల వైఖరి కూడా పార్టీకి కలిసి రావడం లేదు. వారు వివాదాలకు కేంద్రంగా మారుతుండగా, పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగానే ఉంది. అంతా నేతలే చూసుకుంటారులే అనే ధోరణితో ముందుకు సాగుతుంటే, పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీని సరిచేయాల్సిన వారు కూడా ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
మొత్తంగా చూసినట్టైతే, ఈ రెండేళ్లలో వైసీపీ పుంజుకున్నది అయితే లేదనే చెప్పాలి. గెలుపు ఓటములు సాధారణమే అయినా, కారణాలను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం పార్టీపై ఉంది. ప్రజాస్వామ్యంలో ఈ తరహా approach తో నిలదొక్కుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.





